ఎండాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే స్మార్ట్ వాటర్ బాటిల్స్ సమాచారం మీకోసం 

సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ ఎండాకాలంలో మనిషికి వడదెబ్బ కొట్టకుండా ఉండాలంటే వీలైనంత వరకు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ తాగే నీళ్ మోతాదు తెలుసుకోవాలంటే ఏం చేయాలి. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి. మనం ఎన్ని లీటర్ల నీళ్లు తాగుతున్నామో ఎలా తెలుసుకోవాలి.. ఇలాంటి అనేక విషయాలకు ఇప్పుడు సరైన సమాధానం స్మార్ట్ వాటర్ బాటిల్స్ రూపంలో లభిస్తోంది. ఇవి సాధారణ వాటర్ బాటిల్స్ అయినప్పటికీ టెక్నాలజీతో అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మన కదలికల్ని పసిగడుతూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి వాటర్ బాటిల్స్ పై ఓ స్మార్ట్ లుక్కేయండి.

CloudCUP Hydration Tracker Smart Bottle
ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంల మీద పనిచేస్తుంది. బ్లూటూత్ టెక్నాలజీ ద్వారా పనిచేసే ఈ స్మార్ట్ బాటిల్ మీ డ్రింకింగ్ షెడ్యూల్ ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. ఇందులో ఉన్న సెన్సార్లు  వాటర్ ఫ్యూరిటీని కూడా తెలియజేస్తాయి.

Foladion Smart Sports Water Bottle
బయటకు వెళుతున్న సమయంలో మిమ్మల్ని వాటర్ సమస్య నుంచి ఈ బాటిల్ గట్టెక్కిస్తుంది. ఈ బాటిల్ ప్లాస్టిక్ తో కాకుండా వేరే మెటల్ తో తయారు చేయడం వల్ల మీకు ప్లాస్టిక్ వాసన మచ్చుకైనా కనిపించదు. మీరు పర్వతాలు కాని కొండలు కాని అధిరోహించే సమయంలో దీన్ని ఉపయోగించుకోవచ్చు.

SWIGM Smart Water Bottle
ఈ బాటిల్ లో మీరు మీకు నచ్చిన విధంగా టైం సెట్ చేసుకోవచ్చు. మీరు ప్రతి రెండు గంటలకు వాటర్ తాగాలని అనుకుంటే ఈ బాటిల్లో సెట్ చేసుకోవచ్చు. మీకు టైం కాగానే అలర్ట్ మెసేజ్ ఇస్తుంది.

Hidrate Spark 2.0 Smart Water Bottle
పర్యావరణ ప్రియమైన ట్రిటాన్‌ ప్లాస్టిక్‌తో ఈ బాటిల్‌ను తయారు చేశారు. ఇందులో 710 మిల్లీలీటర్ల నీటిని పట్టుకోవచ్చు. కాయిన్‌ సెల్‌ బ్యాటరీలతో నడిచే సెన్సర్‌ స్టిక్‌ ఇందులో ఉంది. ఈ బాటిల్‌ లోంచి నీళ్లు తాగిన ప్రతిసారీ సమాచారం యాప్‌కు చేరుతుంది. మొబైల్‌కు సందేశాలు వస్తుంటాయి. నీళ్లు తాగాలని గుర్తుచేస్తూ మధ్య మధ్యలో బాటిల్‌లో వెలుగులు రావడం దీని ప్రత్యేకత. వ్యక్తిగత లక్ష్యాలను పెట్టుకునేందుకు అనువైనది.

Thermos Hydration Bottle with Connected Smart Lid
ఈ బాటిల్‌లో 700 మిల్లీలీటర్ల నీటిని పట్టుకోవచ్చు. బ్లూటూత్‌ ఆధారంగా పనిచేస్తుంది. మూత మీదే ఎలకా్ట్రనిక్‌ కాంపొనెంట్స్‌ అన్నీ ఉంటాయి. మైక్రో యూఎస్‌బీ సాకెట్‌తో సులభంగా రీఛార్జ్‌ చేయొచ్చు. బాటిల్‌ లోపలున్న ట్యూబ్‌ ద్వారా నీటి పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. రోజు, వారం, నెలలో... ఎంత నీటిని తాగుతున్నామో సులభంగా లెక్కవేసుకోవచ్చు. ఈ సమాచారాన్నంతా యాప్‌ ద్వారా ఈమెయిల్‌ లేదా సామాజిక మాధ్యమాలకి బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది. రిమైండర్స్‌ కూడా వస్తుంటాయి.

H20Pal Smart Water Bottle Hydration Tracker
ఈ బాటిల్‌కి మొబైల్‌ యాప్‌ అవసరం లేదు. 650 మిల్లీలీటర్ల నీటిని దీంట్లో నిలువచేయవచ్చు. ఇందులో డిస్‌ప్లే స్ర్కీన్‌, బటన్స్‌ ఉంటాయి. టార్గెట్స్‌ సొంతంగా సెట్‌ చేసుకోవచ్చు. లిథియమ్‌ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది.

ఈక్వా స్మార్ట్‌ వాటర్‌ బాటిల్‌
ఈక్వా యాప్‌తో పనిచేసే ఈ వాటర్‌ బాటిల్‌ను స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో తయారు చేశారు. రెండు ఇన్సులేషన్లు ఉండటం వల్ల పన్నెండు గంటల పాటు చల్లని లేదా వేడి నీటిని అదే ఉష్ణోగ్రత దగ్గర ఉంచుతుంది. బాటిల్‌ దిగువ భాగానికి ట్రాకర్‌ జతచేస్తారు. దీనికి ఎల్‌యీడీ బల్బులు ఉంటాయి. ఎప్పుడు, ఎన్ని నీళ్లు తాగామో దీన్ని బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. నీటి వినియోగం గురించి ఎప్పటికప్పుడు మొబైల్‌కి సందేశాలు వస్తుంటాయి కూడా.

ఓజ్మో ఆక్టివ్‌
యుఎస్‌బీతో ఛార్జ్‌ చేయగల స్మార్ట్‌ బాటిల్‌ ఇది. దాదాపు అరలీటరు నీరు పడుతుంది. మోతాదును చెప్పే సెన్సర్స్‌ ఉంటాయి. ‘హైడ్రేషన్‌ గోల్స్‌’ను సెట్‌ చేసుకోవచ్చు. బాటిల్‌పై మూడు ఎల్‌యీడీ లైట్స్‌ ఉంటాయి. వీటి ద్వారా ఎన్ని నీళ్లు తాగుతున్నామో తెలుసుకోవచ్చు. గంటకు మించి నీళ్లు తాగకుండా ఉంటే, బాటిల్‌లో వైబ్రేషన్‌ మొదలవుతుంది.

న్యూస్ టెక్నాలజీ మొబైల్స్ స్మార్ట్ వాటర్ బాటిల్స్